హృదయమున్న అందం !



షకీరా...షకీరా...షకీరా!
ఈ పేరు తల్చుకుని కళ్ళు మూసుకుంటే చాలామందికి అందమైన రూపం, కవ్వించే కదలికలు కనిపించవచ్చు.
కానీ... ఇదే పేరు తల్చుకుంటే వందలాది అనాథల కళ్ళలో వెలుగు కనిపిస్తుంది!
వేలాది బాధితుల మొహంలో కృతజ్ఞత కదలాడుతుంది!
విద్యుద్దీపాల వేదికపై విద్యల్లతలా ఊగిపోతూ లక్షలాది మందిని రాక్ నృత్యంతో ఉర్రూతలూగించే పాప్ సింగర్‌గానే షకీరాను చూడకండి. ఎందుకంటే...
ఆపన్నుల కోసం ఈ ముప్పై ఏళ్ళ నిండు జవ్వని అందిస్తున్న సాయం విలువెంతో తెలుసా?
200 కోట్ల రూపాయలకు పైమాటే!
షకీరా అంటే అర్థం తెలుసా?
అరబిక్ భాషలో గ్రేస్‌పుల్ అని! అది వాళ్ళ అమ్మమ్మ పేరు. నిఘంటువు తీసి ఈ పదానికి అర్థ్గం చూస్తే ఒక్క సౌందర్యమే కాదు, కరుణ కూడా కనిపిస్తుంది.
పేరులో ఉన్న లక్షణాలు ఈమెలోనూ ఉన్నాయని వేడెక్కించే ఆమె ఆల్బమ్‌లు చూస్తే తెలీదు... కోట్లకు పడగలెత్తిన ఓ అందాల నృత్యగాయని జీవితాన్ని అనుభవించే వయసులో కూడా అభాగ్యుల కోసం చేస్తున్న పనులు చూడాలి.
భూకంపానికి విలవిల్లాడిన పెరూలోను, తుఫాను ముంచెత్తిన నిగరాగువాలోను అన్నీ కోల్పోయిన వారి కోసం షకీరా 40 మిలియన్ డాలర్ల (సుమారు 160 కోట్ల రూపాయలు) సాయాన్ని తాజాగా అందించింది.

"లాటిన్ అమెరికాలో 4 కోట్ల మంది పిల్ల్లలు బడికి వెళ్ళడం లేదు. 51 మిలియన్ల మందికి మంచినీరు దొరకడం లేదు." అంటూ గణాంకాలు చెప్పేటప్పుడు ఆమె చూపుల్లో ఆల్బమ్స్‌లోలాగా మత్తు కనిపించదు. ఆమె గుండెల్లో ఉన్న దయ కనిపిస్తుంది. పేద పిల్లల కోసం ఏటా 5 మిలియన్ డాలర్ల (రూ. 20 కోట్లు) ఇవ్వడానికి కూడా షకీరా అంగీకరించింది. అంతే కాదు విరాళాల ఫండ్‌ని 200 మిలియన్ డాలర్లకు పెంచాలనేది ఆమె ఆశయం.

మరి షకీరా ఆశయం నెరవేరలని ఆశిద్దాం...
బెస్ట్‌‌ ఆఫ్ లక్... షకీరా గారు...
మరి మీరేమాంటారు...
- ఈనాడు సౌజన్యంతో.
Share:

2 comments:

Unknown said...

షకీరా గురించి నాకు ఈ విషయం తెలియదు
ముందుగా తెలియ చేసినందుకు ధన్యవాదాలు

Naga said...

thanks

Ads

Your Add Will Display Here...

Popular Posts

Search

Blog Archive

ADS

320*50

Facebook

Ads

300*450

Recent Posts

Powered by Blogger.