Wednesday, April 23, 2008

కితకితలు

భార్య: మీ అమ్మగారూ పెళ్ళికెళ్ళి వారం రోజులైంది. త్వరగా తీసుకురండి."
భర్త: "అబ్బ...! మా అమ్మంటే నీకెంత ప్రేమా?"
భార్య:"ప్రేమా...పాడా...? పెళ్ళికి నా పట్టుచీర కట్టుకెళ్ళింది... అందుకని...!"

సత్యం: "మా అవిడని పనిమనిషిని పెట్టుకోమని చెబితే అస్సలు వినదు."
శివాజీ: "అయితే మంచిదే కదా... డబ్బుని పొదుపు చేస్తుందన్నమాట."
సత్యం: "ఏం పొదుపో ఏమిటో గానీ... ఇంట్లో పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది."

స్వాతి: "పెళ్ళి చూపులకొచ్చిన్న అబ్బాయిని ఒక్కమాటతో మూర్చపోయేలా చేశావా... ఎలాగే?"
జ్యోతి: "ఏదైనా మాట్లాడు అన్నాడు... ఆటకావాలా... పాటకావాలా? అన్నానంతే."

Wednesday, March 5, 2008

ఇంతకు ఏమి చేశాను? ఏమి చేయబోతున్నాను...

కరక్ట్గా నెలపైన బ్లాగ్ లోకానికి సెలవు తీసుకున్నానండి. ఇదిగో ఈ రోజు దర్శనానికి వీలు కుదిరింది.
మరి అందరు క్షేమమే అనుకుంటున్నాను, మరి నెలకుపైగా సెలవు తీసుకున్నాను ఏమి ఘనకార్యం చేసి ఉంటాడులే అని ఆలోచిస్తున్నారా?
అది మాది గ్రామీణ ప్రాంతమయే ఏదో నా స్తోమతకు తగ్గట్లు ఏదో చేయాలి అనే తపణ, 1998 నుండి శ్రామిస్తున్నాను.
ఇంతకు ఏమి చేశాను? ఏమి చేయబోతున్నాను...
CLICK HEREహృదయం వున్న ప్రతి ఒక్కరు తప్పకుండ చూడ వలసిన వెబ్ పేజి. మరి తప్పకుండా ఈ (www.polite.741.com) సైట్ లింక్ను మీ బ్లాగ్లొ వుంచి మీ వంతు సహకరాన్ని అందిస్తారన్ని అశిస్తున్నాను...
(మీరు చూడబోయె వెబ్ పేజ్ ఉచిత హొస్టింగ్ వారిది. కావున ఒక్కొసారి పేజిలొ ఉండే పిక్చర్స్ సరిగా కనిపించని యెడల క్లోజ్ చేసి మళ్ళి ఒపెన్ చేయండి తప్పకుండ పలితం ఉంటుంది.
చివరగా ఒక మాట. నేను ఇంత వరకు ఎన్నొ ప్రయత్నాలు చేశాను. ఇక మిగిలింది బ్లాగ్లను వ్రాస్తున్న వారి నుంచి సహకారాన్ని పొందాలని ఆశిస్తున్నాను. నేను చేయబోయె కార్యక్రమాలకు మీ వంతు సహకరాన్ని, అముల్యమైన సలహాలను అందిస్తారని కోరుచున్నాను.
మీరు తల్చుకుంటే ఈ కార్యక్రమాలను చేయడం చాలా సులబం అవుతుంది. కేవలం ప్రతి ఒక్కరు (www.polite.741.com) ఆ సైట్ లింక్ను మీ బ్లాగ్లొ వుంచండి. )


మీ...
గుమ్మడాల చంద్రశేఖర్ గౌడ్

Sunday, January 13, 2008

నాకు నచ్చిన ఇంగ్లీష్ సామెతలు:

Youth and beauty are like fashim both fade away.
యౌవనం, అందం ఫ్యాషన్ లాంటివే రెండూ ఎంతో కాలం ఉండవు, వాడిపోతాయ్.

Lips however rosy must be fed.
గులాభీ లాంటి అందమైన పెదవులకు కూడా పోషణ అవసరం.

Kind words are better than cornets.
దయగల మంచిమాటలు కిరీటాలకన్న విలువైనవి. (వజ్రం కన్న)

Better un taught than ill taught.
చెడుగా చదువు కొనే కన్న చదువు లేకపోవడమే మేలు.

Catch not the shadow and lose the subject.
నీడను పట్టుకోనే విషయంలో అసలు వస్తువును పోగోట్టుకోకు.

Monday, January 7, 2008

DOWNLOAD చేసుకోండి

అలుగాకు రా నలుగురిలో ఓ రాజా... అనే పాటను DOWNLOAD చేసుకోండి...DOWNLOADSunday, January 6, 2008

నీలాంటి స్నేహితుని పొందిన అకీల్ అహ్మద్ చాలా అదృష్టవంతుడు.


ఏ బంధమూ చేయని సాయం స్నేహ బంధం మాత్రమే చేస్తుందనడంలో సందేహం లేదు.
ఆపదలో సహాయం చేయడానికి బంధువులు వెనుకడుగు వేసినపుడు కూడా స్నేహితుడు ముందుకే అడుగు వేస్తాడనేందుకు ఈ సంఘటనే ఉదాహరణగా నిలుస్తుంది. ఉత్తరప్రదేశ్ బరేలికి చెందిన ఇద్రిన్ ఖాన్‌‍, అకీల్ అహ్మద్ ఇద్దరూ బాల్యస్నేహితులే కాదు ప్రాణస్నేహితులు కూడా. దేహాలు వెరైనా ప్రాణాలు ఒక్కటే అన్నట్టుగా బాల్యం నుంచి పెరిగారు. ఇటువంటి స్తితిలో అకీల్ అహ్మద్‌కు జబ్బు చేయడంతో వైద్య పరీక్షలు చేయించగా, రెండు కిడ్నీలు (మూత్రపిండాలు) దెబ్బ తిన్నందున వేరే వారి మూత్రపిండాన్ని అత్యవసరంగా అమర్చాలని వైద్యులు సూచించారు. అసలే చిత్తు కాగితాల వ్యాపారం చేసే అకీల్ మంచం పట్టడంతో పూట గడవడమే కనాకష్టమైంది. ఇక వేరే వారి మూత్రపిండాన్ని కొనుగోలు చేసి అమర్చుకోగల ఆర్థికస్తోమత వారికి లేదు. ఇక మిగిలింది బంధుగణమే... కావడంతో అకీల్ బార్య నగ్మా వారికి పరిస్థితి తీవ్రతను వివరించింది. అకీల్ తోడబుట్టిన వారు కూడా ఏవేవో కుంటిసాకులు చెప్పి ముఖం చాటేశారే తప్ప ఆమెకు అండగా నిలవ లేదు.

మరోవైపున అకీల్‌కు త్వరగా మూత్రపిండం అమర్చకపోతే ప్రమాదమని వైదులు హెచ్చరించడంతో నగ్మాకు ఏమి చేయలో పాలుపోవడం లేదు. ఈ సమయంలోనే మీకు నేనున్నాను, భయం లేదు. ‘అంటూ అకీల్ ప్రాణంలో ప్రాణమైన స్నేహితుడు ఇద్రీస్‌ఖాన్ ముందుకోచ్చాడు. తన మూత్రపిండాల్లో ఒకటి స్నేహితునికిచ్చి అతన్ని బ్రతికించుకుంటానని చెప్పాడు. కానీ, మూత్రపిండం ఇవ్వడానికి ఇద్రీస్ సిద్దమైనా దాన్ని అమర్చే శస్త్రచికిత్స చేయడానికి చేతిలో ఫైసా లేని దైనం అకీల్ బార్యది. ఈ లోగా ప్రాణస్నేతుల వైనాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న కొందరు దాతలు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు రావడంతో అకీల్‌కు మూత్రపిండం అమర్చడానికి వీలు కలిగింది. త్వరలోనే అకీల్ అహ్మద్‌కు ఇద్రీన్‌ఖాన్ మూత్రపిండాన్ని అమర్చగలమనిస్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ అగర్వాల్ తెలిపారు.

నీ లాంటి స్నేహితులు కోటికి ఒక్కరు ఉంటారు. నీలాంటి స్నేహితుని పొందిన అకీల్ అహ్మద్ చాలా అదృష్టవంతుడు.

ఇద్రీస్‌ఖాన్ You are real Friend..........

మీరేమాంటారు...

(ఈనాడు సౌజన్యంతో...)