Home »
MY HEART BEAT
» మీరే చెప్పండి?
మీరే చెప్పండి?
మొన్న గోకుల్ చాట్, లుంబిని పార్క్ నేడు పల్లెటూళ్ళలో కూడ మత పిచ్చి. మదొక పల్లెటూరు, ఈ రోజు అనగా మంగళవారం (01-10-2007) నవగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు. షాప్స్, పాఠశాలలు అన్ని బంద్. ఈ మత కల్లోలలు, ఉగ్రవాదం అనేది ఎప్పుడు రూపు మారుతుందో తేలియదు కాని మన ఆదర్శవంతమైన భారతదేశం మత కల్లోలతోనే విసిగెత్తిపోతుంది అనడంలొ సందేహంలేదు. మనదేశంలో ఉంటు, మన తిండి తింటు, మన బట్ట కట్టి మన దేశానికే ద్రోహం చేయడం ఎంత వరకు సమాంజసం మీరే చెప్పండి?
7 comments:
చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి దాడులు ఏ మతంపైన జరిగినా ఖండించవలసిన అవసరం ఉంది.
మొన్న ఇరవై ఇరవై పోటీలో మనవాళ్ళు పాకిస్తాన్ను ఓడించినపుడు మన కర్నూల్లో మత కలహాలు జరిగాయి, మీకు తెలిసే ఉంటుంది. అదీ మన పరిస్థితి!
దారుణం.పల్లెటూళ్ళల్లో అయినా మతసామరస్యం తో ప్రశాంతం గా బతుకుతున్నారనుకున్నాను.ఎటుపోతుందీ దేశం?
చాలా బాధాకరమైన విషయం
క్రికెట్లో మన వాళ్లు పాకిస్తాన్ని ఓడించినప్పుడు మత కల్లోలాలు జరగడమనేది చాలా బాధాకరం అయిన విషయం. అక్కడ వాళ్లు దేశంకన్నా కూడా మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం విచారకరం.
సర్లెండి.. ఆ రోజు ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ "ప్రపంచం లో ఉన్న ముస్లిములందరికీ క్షమాపణలు" చెప్పలేదూ? అతని టీం ప్రపంచ ముస్లిముల తరపున ఆడుతోందా? అంత బాధ్యతాయుతమయిన స్థానం లో ఉన్న వాడే అలా అంటే మరి సామాన్యుల సంగతి ఏమంటారు?
అవును ఫణికుమార్ గారన్నట్లు, అసలు మాలిక్ ముస్లిమ్ లకి క్షమాపణ చెప్పడం ఏంటో, నాకూ అర్ధం కాలేదు.. అతను ఆడింది పాకిస్తాన్ తరపున కానీ, ముస్లిమ్ ల తరపున కాదు కదా...!
Post a Comment