తేనెల తేటల మాటలతో
మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని - ఇక
జీవనయానం చేయుదమా
సాగర మేఖల చుట్టుకొని - సుర
గంగ చీరగా మలచుకొని
గీతాగానం పాడుకునీ-మన
దేవికి యివ్వాలి హారతులు...
గంగా జటాధరభావనతో - హిమ
శైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ - ఒక
బృందగానమే చేస్తుంటే...
ఎందరో వీరుల త్యాగఫలం - మన
నేటి స్వేచ్చకే మూలధనం
వారందరినీ తలచుకొని - మన
మానస వీధిని నిలుపుకొని...
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని - ఇక
జీవనయానం చేయుదమా
సాగర మేఖల చుట్టుకొని - సుర
గంగ చీరగా మలచుకొని
గీతాగానం పాడుకునీ-మన
దేవికి యివ్వాలి హారతులు...
గంగా జటాధరభావనతో - హిమ
శైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ - ఒక
బృందగానమే చేస్తుంటే...
ఎందరో వీరుల త్యాగఫలం - మన
నేటి స్వేచ్చకే మూలధనం
వారందరినీ తలచుకొని - మన
మానస వీధిని నిలుపుకొని...
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
2 comments:
కొన్ని చిన్న సవరణలు:
రెండవ లైన్ లో: మన దేశమాతనే కొలిచెదమా అని రావాలి..
పధ్నాల్గవ లైన్ లో: మూలచలం కాదు మూలధనం అని ఉండాలి..
మరచిపోతున్న దేశభక్తి గీతాలని గుర్తు చేశే మీ ప్రయత్నం హర్షణీయం..
చిన్నప్పుడు తెగ పాడుకునేవాళ్ళం ఈ పాటని.
మేధ గారూ మీ సునిశిత దృష్టికి జోహార్లు. వచ్చిన పాటలని,పద్యాలని చదువుతున్నప్పుడు మనకి వచ్చినట్టే చదువుకుపోతాము.అందులోని దోషాలు అస్సలు పట్టవు నాకు.
Post a Comment