Saturday, December 22, 2007

సుందరమైన మనదేశం

సుందరమైన మనదేశం

పల్లవి: సుందరమైన మనదేశం సువిశాల భారతదేశం
ఎందరెందరో మహానుబావులు ఏలిన దేశం మన దేశం ||సుందర||

1. గాంధీ మహాత్మా చాచా నెహ్రూ
గణతర వీరులు జనన మొందిన ||సుందర||

2. గంగా, కృష్ణా, గోదావరులు
గలగల పారె సెలయేరులెన్నో
తుంగబద్ర కావేరి పెన్నా
పొంగి పొరలే జీవనదులు గల ||సుందర||

3. అందము చిందే దేవాలయములు
అందున దైవ స్వరూపములు
ఎందున గాంచని వింధ్య హిమాచల
నందన వనులతో నవ శోభలొలికే ||సుందర||

4. పచ్చని పైరులు విలసిల్లే
పాడి పంటలకు సౌభాగ్యసీమ
ముచ్చటైన మువ్వన్నెల జెండాతో
మురిపాలొలికెను జన్మభూమి ||సుందర||

No comments: