Sunday, December 2, 2007

ఝాన్సీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి

పల్లవి: ఝాన్సీ లక్ష్మీబాయిరా జాతికే వెలుగాయెరా స్త్రీ జాతికే వెలుగాయెరా ||ఝా||

1. దేశభక్తిని గాంచెరా ధైర్యాశక్తీనేంచెరా
దేశభక్తిని పెంచెరా ధర్మాలను భోదించెరా
రాజ్యం తెర్లెపోయెరా రాబందుల పాలయెరా
అధికారంబె బోయెరా ఆంగ్లేయుల పాలయెరా ||ఝా||

2. బానిస బ్రతుకై పోయెరా బ్రతుకె వ్యర్థమాయెరా
కన్నులెర్ర జేసెరా కఠినాత్ములనే జూసెరా
రౌలత్ చట్టం గాంచెరా రౌడీమూకల ధృంచెరా
వీర నారీ లేచెరా విజృంభన గావించెరా ||ఝా||

3. బళ్ళెము చేతబట్టెరా ఆ తెల్లదొరల గొట్టెరా
స్వరాజ్యమె మనకొచ్చెరా సంతోషంబును దెచ్చెరా
విజయంబు సాధించెరా వీరస్వర్గము నొందెరా
మల్లెపూవులు రువ్విరా మంగళహారతులివ్వరా ||ఝా||

No comments: