

పండిత నెహ్రూ పుట్టిన రోజు
పాపలందరికి పండగ రోజు
సమతా మమతా పుట్టిన రోజు
మంచికి కోవెల కట్టిన రోజు
ముత్యంలాంటి మోతీలాలుకు రత్నంలా జన్మించాడు
జాతిరత్నమై వెలిగి ఇంకొక జాతి రత్నమును కన్నాడు
అతడే జవహరులాలు అతనికి మన జేజేలు - 2 ||పండిత||
తలపై తెల్లని టోపి ఎదపై ఎర్రగులాబి - 2
పెదలపై చిరునవ్వు మదిలో పున్నమిపువ్వు
చేతిలో పావురం మనజాతికి అతడే గోపురం - 2 ||పండిత||
మహాత్మగాందీ అడుగుజాడలో స్వరాజ్య సమరం నడిపాడు
రణ దాహంతో రగిలే జగతిని శాంతి సుధలు కురిపించాడు
కన్నుమూసినా జవహర్‌లాల్ కంటిపాపగా వున్నాడు
ఇంటింట జ్యోతిగా వున్నాడు చాచానెహ్రూ అమర్‌రహే - 3

0 comments:
Post a Comment