Tuesday, October 30, 2007

గడ్డాన్ని తీసెయ్యాలని రజనీ డిసైడయిపోయాడు ఎందుకు?...


రజనీకాంత్ ఇంట్లో ఉంటే ఎక్కువగా గడ్డంతోనే ఉంటాడు. ఏదైనా పూజ చేసినా కూడా అలానే కనిపిస్తాడు. కాకపోతే ఈ మధ్య క్లీన్ షేవ్ చేసుకోవాల్సి వస్తోందిట. కారణం... ముద్దుల మనవడు యాత్ర, అదేనండీ ఐశ్వర్య, ధనుష్‌ల కొడుకు! యాత్ర అంటే రజనీకి చాలా ముద్దు. ఖాళీగా ఉంటే ఐశ్వర్య ఇంటికి వెళ్లి యాత్రతో కాసేపు కాలక్షేపం చేసి వస్తుంటాడు రజనీ. ఓ రోజు రజనీ ముద్దు పెట్టుకుంటుంటే యాత్ర బుగ్గలకి గడ్డం గుచ్చుకుంది. అంతే, ఆ పిల్లాడు ఏడుపు మొదలు పెట్టాడు. ఎంత లాలించినా ఏడుపు అపలేదు. రోజంతా ఏడుస్తూనే ఉన్నాడట. దాంతో, మనవడి కష్టానికి కారణమైన గడ్డాన్ని తీసెయ్యాలని రజనీ డిసైడయిపోయాడు. ఆరోజు నుంచి ఐశ్వర్య ఇంటికి ఎప్పుడు వెళ్లినా క్లీన్ షేవ్ చెయ్యందే బయలు దేరడట రజనీ.

ఈనాడు సౌజన్యంతో...

Monday, October 29, 2007

సామెతలు

If you have a thing well done do it yourself.
పని మంచిగా ఉండాలి అని అనుకుంటే నీవె సొంతంగా చేసుకో.

He that dare not venture must not blame his Luck.
సాహసం చెయ్యలేని వాడు తన అదృష్టాన్ని నిందించుకోకూడదు.

A servant is known in his master's absence.
సేవకుడు, యజమాని లేనప్పుడు బయట పడతాడు.(ఎటువంటి వాడైంది తెలుస్తుంది)

Fools build houses where men live in them.
మూర్ఖులు (తెలివి తక్కువ) యిండ్లు కట్టుకుంటె తెలివైన వాళ్లు వాటిలో నివసిస్తారు.


Every wind is ill to a broken ship (mill)
పగిలిన ఓడకు ప్రతిగాలి చెడుగానే ఉంటుంది.

Sunday, October 28, 2007

నో అనలేక పోయాను...


అందరికీ నమస్తే. నేనే అప్పూ. నా నటనకు ఎంత మంచి పేరొచ్చిందంటే గాయత్రీరావు అని ఇక ఎవరూ పిలవరేమో! నేను ఇటు సైడు రావాలని అనుకోలేదసలు. మా అమ్మ సినిమాలో చాలా కాలం నుంచి నటిస్తోంది. ఒకరోజు శేఖర్ గారు "నటనకు రెడీనా?" అనడిగారు. ఆయనతో కలిసి పని చేసే మంచి అవకాశం. నో అనలేక పోయాను. నా చదువంతా గర్ల్స్ కాలేజీలోనే. కానీ బయట ఫ్రెండ్స్‌తో చాలా సరదాగా ఉంటాను. ఎంకమ్మ టైపు పదాలు మామూలే. అప్పూలాగానే నేను కొంచెం అల్లరి, కొంచెం సీరియస్. చదువంటారా... మెహదీపట్నం సెంట్ ఆన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాను. కూచిపూడి నాట్యం, శాస్త్రీయ సంగీతంలో ప్రవేశముంది. నేను నాజూకే. పొడుగాటి జడ ఉండేది. అప్పూగా కనిపించడం కోసం లావయ్యాను. హిప్పీ చెయించాను. ఇక కాలేజీ సరదాలంటే... యు ఆర్ సో బ్యూటిఫుల్ గాయత్రీ అన్న అబ్బాయిలు చాలామందే.

Saturday, October 27, 2007

కితకితలు


డైరెక్టర్ : "క్లైమాక్స్ సీన్లో హీరోని నిజంగా కొండపైనుండి తోసెయ్యాలా... ఎందుకు?"
నిర్మాత: "వేరే రూటు లేదు మరి...! హీరోకి నేను 5 లక్షలు బాకీ వున్నాను."


"డాక్టర్‌గారూ...! మా ఆవిడ ప్రసవించిందా?"
"ఇంకా లేదండి!"
"దానికి మతిమరుపు కాస్త ఎక్కువండి. అప్పుడప్పుడు మందలిస్తూ వుండండి.


"ఈ సంసారం ఈదలేక ఛస్తున్నానే."
"అదంతా నా ఖర్మండీ...! ముందే ఈత వచ్చినవాడ్ని కట్టుకునుంటే బాగుండేదేమో...!"

Thursday, October 25, 2007

అమ్మాయిల నుంచి ఒకటే ఫోన్లు!








హ్యపీడేస్‌లో నేను టైసన్ బన్‌గయా జంటిల్‌మెన్.బయట మాత్రం రాహుల్. సొంతూరు నిజామాబాద్. పెరిగింది, చదివింది హైదరాబాద్ లో. అటు చదువు, ఇటు సినిమాలు రెండూ ఆసక్తే. ఇక్పాయ్ బిజినెస్ స్కూలు నుంచి బీబీఏ కోర్సు చేశాను. ఆ చదువు విజ్ఞానానికి. ఆపై నటనదారి దానిదే. శేఖర్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్.ఆయన సహకారం వల్లే నటుణ్ని కాగలిగాను. సినిమాలోలాగా నేను బయట మరీ కలుపుగోలు కాదు. చాలా రిజర్వుడు. ఫ్రెండ్స్ ఉన్నది కొందరే. కానీ వారే ప్రాణమిత్రులు. మరీ సన్నగా, స్లిమ్‌గా ఉంటాడన్న ఎద్దేవానే టైసన్ పేరు. కానీ అలా తయారయ్యేందుకు నేను రెండు నెలలు కష్టపడ్డాను. తొమ్మిది కెజీల బరువు తగ్గాను. నటనంటే పిచ్చి. టైసన్‌గా మస్తు చేశావంటు అమ్మాయిల నుంచి ఒకటే ఫోన్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నా. ఇంతవరకూ నేనెవరికీ లైన్ వేయలేదు లెండి. పబ్‌లకు మాత్రం అప్పుడప్పుడు వెళుతుంటా. మా నాన్న బిజినెస్‌మ్యాన్. నన్నూ రమ్మంటున్నారు. కానీ మనసు ఊరుకుంటుందా? మూవీల మీదకే మళ్లుతోంది.

Tuesday, October 23, 2007

lekhini లో తెలుగు ఫాంట్స్ సరిగా కన్పించుట లేదా - Fonts display problem in Lekhini

 lekhini లో తెలుగు ఫాంట్స్ సరిగా కన్పించుట లేదా - Fonts display problem in Lekhini


lekhini లో టైప్ చేసిన లేదా యునికోడ్ సైట్లకు వెళ్లినప్పుడు కొందరు అక్కడి ఫాంట్స్ ని సరిగా చూడలేకపోతుంటారు. Simple గా కంప్యూటర్లో భాషల్ని ఎనేబుల్ చేయడం ఎలాగో చూడండి.

(Win XP యూజర్ల కోసం)
1. Control Panel కి వెళ్లండి.
2. Date,Time and Regional & Language Options మీద Click చేయండి.
3. Pick a task... పైన ఉండే Add other Languages ట్యాబ్ క్లిక్ చేయండి. ఓ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
4. Install files for complex Scripts, Install files for East Asian Languages అనే రెండు చెక్‌బాక్స్‌లు కనిపిస్తాయి. వాటిని టిక్ చేయండి. OK నొక్కండి.

5. Win XP CDని డ్రైవ్‌లో ఉంచండి. ఫైల్‌ని అదే తీసుకుంటుంది. (లేదా సిస్టమ్‌లోనే Dump ఉంటే i386 అనే ఫోల్డర్‌ని అడుగుతుంది. పాత్ ఇవ్వండి.)
6. సిస్టమ్ Restart చేయండి.


ఆ రాయే రత్నమైంది

ఆ రాయే రత్నమైంది

హాయ్ నేను చందు. మధు లవర్‌ని. బయట సందేశ్ అన్నా పలుకుతాను. నేను సినిమాల్లోకి రావడం అంతా ఓ కలగా ఉంది. అమెరికాలోని న్యూజెర్సీ ఓ రోజు నెట్‌లో ఉండగా కొత్త నటీనటులు కోసం శేఖర్ గారిచ్చిన ప్రకటన చూశా. ఓ రాయేద్దాం అనుకున్నా. అది రత్నంలాంటి అవకాశాన్నిచ్చింది. నేనక్కడ ప్లస్‌టూ చదువుతున్నా. జూన్‌లో పరీక్షలు. అయినప్పటికీ రివ్వున ఎగిరొచ్చి ఆంధ్రాలో వాలా. ఐదేళ్ల వయసులో అమెరికాకు వెళ్లిపోయినా, నా మూలాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. రెండేళ్లకోసరి ఇండియా వచ్చేవాణ్ని. న్యూజెర్సీలోని మా ఇంట్లో హాయిగా తెలుగులో మాట్లాడుకుంటాం. సినిమాలో చందు కాస్త కూల్. బయట నేనాలా కాదు. చాలా చిలిపి. యమా స్పీడు. బాస్కెట్‌బాల్, అమెరికన్ పుట్‌బాల్ ఇష్టమైన ఆటలు. ఐతే మొదటిసారి కదా... మధుతో రొమాంటిక్ సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు కొద్దిక్షణాలు ఇబ్బందిపడ్డా. ’ఇదంతా నటన... బీకూల్’ అంటూ తను టెన్షన్ పోగొట్టింది. ఇండియాలో సినిమా రిలీజ్ కాగానే గబగబా అమెరికా వచ్చేశాను. పరీక్షలు రాయాలిగా! నేనిక్కడ బ్రిలియంట్ స్టూడెంట్‌ని. ఆ ర్యాంకు కాపాడుకోవడం కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నా. కానీ ఎప్పుడెప్పుడు ఆంధ్రాకు వచ్చేస్తానా అని ఉంది. నాలుగైదు అవకాశాలూ తలుపు తడుతున్నాయి. ఓహ్ సారీ... మీకు చెప్పలేదు కదూ... అమెరికాలో హ్యాపిడేస్ సూపర్ హిట్.

ఆరునెలల కోర్సు అదుర్స్

హలో నేను మధు. అసలు పేరు తమన్నా. పరికిణీ, ఓణీలో తెలుగమ్మాయిలా కనిపించాను కదూ! కానీ మాది ముంబై. పుట్టింది, పెరిగింది అక్కడే. 12 ఏళ్ల వయసులో థియేటర్ వైపు వచ్చాను. ఆ తరువాత నటన
, నాటకాలతోనే సరిపోయింది. పదో క్లాసు నుంచి స్కూలుకెళ్లడం తగ్గిపోయింది. కరస్ఫాండెన్స్ కోర్సులో ఇంటర్ చదువుతున్నా. ’ఫేయిర్ అండ్ లవ్లీ’తో మోడలింగ్‌లో పేరొచ్చింది. ’శ్రీ’తో తెలుగు సినిమాల్లో అడుగుపెట్టా. హ్యాపీడేస్ నేను కాలేజీకెళ్ల్లని లోటుని తీర్ఛింది. ఏకంగా ఆరు నెలలు సీబీఐటీ కాలేజీలో ఉండే అవకాశం లభించింది. నా తీరుకి మధు క్యారెక్టర్ అతికినట్టు సరిపోతుంది. నేను స్పీడు కాదు. అలాగని స్లో కాదు. ఒద్దికగా ఉంటాను. సౌకర్యంగా ఉండే భారతీయ దుస్తుల్నే ధరిస్తాను. పార్టీలకు వెళ్లను. అంత తీరిక లేదు. పదిహేడేళ్ల అమ్మాయిని. అమ్మానాన్నలు కంటికి రెప్పలా చూసుకుంటారు. అందం, నటన... రెండూ బావుంటేనే ప్రశంసలని నాకు తెలుసు. ఆదరించిన ఆంధ్రా యూత్‌కి థ్యాంక్స్.

Thursday, October 18, 2007

భారతమాతకు జేజేలు Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu

(బడిపంతులు) ఘంటసాల Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu
 

పల్లవి: భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు "భారత"
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు "భారత"

చరణం: త్రివేణి సంగమ పవిత్ర భూమి
నాలుగు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి |2| "భారత"

చరణం: శాంతి దూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలసిన నెహ్రూ
విప్లవ వీరుల వీరమాతలు |2|
ముద్దుబిడ్డలై మురిసిన భూమి "భారత"

చరణం: సహజీవనము సమభావనము
సమత వాదము వేదముగ
ప్రజాక్షేమము ప్రగతి మార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి "భారత"

Tuesday, October 16, 2007

SMS from Bloggers

 SMS from Bloggers


I can c tea in t-cup
Can u c world in world cup?
I can fix my PP size photo in pas pot,
Can u fix stamp size photo in a stamp?
I can speak at any stage, can u speak at
coma stage? I can send my ad's 2 ur cell,
Can u send ur cell 2 my adrs?
Try above all... at least last one.

- R.Venkat,
warangal.

Add kosam Mahesh Thumsup
Pavan mana kosam Pepsi
Trisha sales kosam Fanta... taagaru.
Mana sneham kosam nuvvu...
DOMEX aina taagava?
Plz...
- Dhanalaxmi,
Visakhapatnam.

A new teacher joins school.
She finds two boys similar in appearance
she asks: Are you twins?
They replied, "Jee nahi, we r neighbours"

- Y.Maruthi,
Gadwal.

Friday, October 12, 2007

కితకితలు

"ఈ రోజు చెవిటివారి సంఘ వార్షికోత్సవం.మన ఛైర్మన్‌గారిని ఎన్నిసార్లు మాట్లాడమని కోరినా ఆయన వినిపించుకోవడం లేదు.అందువల్ల ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాం.

రాజు: "సినిమాకి పుస్తకాలు ఎందుకు తెచ్చావ్‌రా?"
రవి : "పరీక్షలు కదరా!టైమ్ వేస్ట్ చెయ్యడమెందుకు?ఇంటర్వెల్‌లో చదువుకోవచ్చని?"

డైరెక్టర్ : "మన సిన్మాలో ఓ దెయ్యం పాత్ర వుంది.ఆ పాత్రకు ఎవ్వరిని సెలక్ట్ చేద్ద్దామంటవ్?"
నిర్మాత: "దానికంత పరేషాన్ దేనికండీ...!మన హిరోయిన్‌కి మేకప్ తీయించేస్తే సరి...!"

విలేఖరి: "మీరు సిన్మాలో ఎందుకు నటించలేకపోయారు?"
నటి : "టి.వి.సీరియల్ అనంతరాగాలులో వెయ్యి ఎపిసోడ్లు నటించాను కనుక...!"

Thursday, October 11, 2007

జయ జయ జయ ప్రియ భారతీ Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu

Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ, దివ్యధాత్రి!
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయ నేత్రి!
జయ జయ సస్యామల సు
శ్యామల చలచ్చేలాంచల!
జయ వసంత కుసుమలతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లక్షారుణ పదయుగళా!
జయ జయ జయ ప్రియ భారత...
జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ!
జయ గాయక, వైతాళిక
గళ విశాల పద విహరణ!
జయ మదీయ మదుర గేయ
చుంబిత సుందర చరణా!
జయ జయ జయ ప్రియ భారత...

-దేవులపల్లి కృష్ణశాస్త్రి

Wednesday, October 10, 2007

కితకితలు

సిన్మా థియేటర్లలో ప్రక్కనున్న వ్యక్తిని "ఏమిటలా వణికిపోతున్నారు?"
ప్రేక్షకుడు: "ఊటీలో పాట కదండీ... చలిగా వుంది."

********************************************************************************
బుకింగ్ క్లర్క్: "ఏమిటీ! అప్పుడే మీరు 4 వసారి వచ్చి టిక్కెట్ తీసుకొంటున్నారు. అన్నీఒకేసారి తీసుకోవచ్చు కదా?"
ప్రేక్షకుడు: "ఏం చెయ్యమంటారండి! ఎవడో పిచ్చాడు గేట్ వద్ద అస్తమాను నా టిక్కెట్ చింపేస్తుంటే ఎక్కడ చావనండీ!"

**********************************************************************************
టీచర్: "ఒరేయ్ బుజ్జీ హిట్లర్ అంటే ఎవర్రా?"
బుజ్జి: "మెగాస్టార్ చిరంజీవి సార్...!"

**********************************************************************************
రైటర్: "నిర్మాతగారూ... మన కథలో హిరోకి ఒక చెయ్యి వుండదు. హీరోయిన్‌కి ఒక కన్ను వుండదు. విలన్‌కి ఒక కాలు వుండదు. ఎలా వుంది?"
నిర్మాత: "సినిమా తీస్తే నేను వుండను."

**********************************************************************************

Monday, October 8, 2007

హృదయమున్న అందం !



షకీరా...షకీరా...షకీరా!
ఈ పేరు తల్చుకుని కళ్ళు మూసుకుంటే చాలామందికి అందమైన రూపం, కవ్వించే కదలికలు కనిపించవచ్చు.
కానీ... ఇదే పేరు తల్చుకుంటే వందలాది అనాథల కళ్ళలో వెలుగు కనిపిస్తుంది!
వేలాది బాధితుల మొహంలో కృతజ్ఞత కదలాడుతుంది!
విద్యుద్దీపాల వేదికపై విద్యల్లతలా ఊగిపోతూ లక్షలాది మందిని రాక్ నృత్యంతో ఉర్రూతలూగించే పాప్ సింగర్‌గానే షకీరాను చూడకండి. ఎందుకంటే...
ఆపన్నుల కోసం ఈ ముప్పై ఏళ్ళ నిండు జవ్వని అందిస్తున్న సాయం విలువెంతో తెలుసా?
200 కోట్ల రూపాయలకు పైమాటే!
షకీరా అంటే అర్థం తెలుసా?
అరబిక్ భాషలో గ్రేస్‌పుల్ అని! అది వాళ్ళ అమ్మమ్మ పేరు. నిఘంటువు తీసి ఈ పదానికి అర్థ్గం చూస్తే ఒక్క సౌందర్యమే కాదు, కరుణ కూడా కనిపిస్తుంది.
పేరులో ఉన్న లక్షణాలు ఈమెలోనూ ఉన్నాయని వేడెక్కించే ఆమె ఆల్బమ్‌లు చూస్తే తెలీదు... కోట్లకు పడగలెత్తిన ఓ అందాల నృత్యగాయని జీవితాన్ని అనుభవించే వయసులో కూడా అభాగ్యుల కోసం చేస్తున్న పనులు చూడాలి.
భూకంపానికి విలవిల్లాడిన పెరూలోను, తుఫాను ముంచెత్తిన నిగరాగువాలోను అన్నీ కోల్పోయిన వారి కోసం షకీరా 40 మిలియన్ డాలర్ల (సుమారు 160 కోట్ల రూపాయలు) సాయాన్ని తాజాగా అందించింది.

"లాటిన్ అమెరికాలో 4 కోట్ల మంది పిల్ల్లలు బడికి వెళ్ళడం లేదు. 51 మిలియన్ల మందికి మంచినీరు దొరకడం లేదు." అంటూ గణాంకాలు చెప్పేటప్పుడు ఆమె చూపుల్లో ఆల్బమ్స్‌లోలాగా మత్తు కనిపించదు. ఆమె గుండెల్లో ఉన్న దయ కనిపిస్తుంది. పేద పిల్లల కోసం ఏటా 5 మిలియన్ డాలర్ల (రూ. 20 కోట్లు) ఇవ్వడానికి కూడా షకీరా అంగీకరించింది. అంతే కాదు విరాళాల ఫండ్‌ని 200 మిలియన్ డాలర్లకు పెంచాలనేది ఆమె ఆశయం.

మరి షకీరా ఆశయం నెరవేరలని ఆశిద్దాం...
బెస్ట్‌‌ ఆఫ్ లక్... షకీరా గారు...
మరి మీరేమాంటారు...
- ఈనాడు సౌజన్యంతో.

Friday, October 5, 2007

మూన్ బాబా...



గురువారము సాయంత్రం 5:25 గంటలు...
అనంతపురం జిల్లా పుట్టపర్తి...
సత్య సాయిబాబా ఆశ్రమంలోని సాయి కుల్వంత్ హాలు...
భజన కార్యక్రమం జరుగుతుంది. సత్యసాయి అనువాదకుడు అనిల్ కుమార్ భక్తులతో మాట్లాడారు. రాత్రి 7 గంటలకు ఆకాశంలో విశ్వరూప విరాట్ దర్శనం ఉంటుందని ప్రకటించారు. చంద్రుడిలో భగవంతుడు కనిపిస్తాడని చెప్పారు. అలా కనిపించేది భగవంతుడా, సత్యసాయా అన్నది స్పష్టంగా పేర్కొనలేదు. అంతే! పట్టణంలోను, రాష్ట్ర్రంలోను సంచలనం చెలరేగింది. చంద్రుడిలో సత్యసాయి కనిపించనున్నారని వార్తలు వ్యాపించాయి. దీంతో పుట్టపర్తి నుంచి జనం తండోపతండాలుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం లోపల వెలుపల భక్తులతో నిండిపోయింది. మరో వైపు దీనిపై టీవిల్లో వార్తలు వచ్చాక... 6:40 గంటలకు క్రమంగా భక్తుల సంఖ్య పెరిగిపోయింది. దాదాపు 10 నుంచి 15 వేల మందికి పైగా అక్కడికి చేరుకున్నారంటే ఎంత భక్తో ఆలోచించాలి. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి ప్రకటనలకు జనాలు తండోపతండాలుగా వెళ్ళారంటే ఆశ్చర్యం వేస్తుంది. బాబాకు అంతశక్తి ఉంటే మబ్బులు పట్టిన, వర్షం కురిసిన ఆకాశంలో విశ్వరూప విరాట్ దర్శనం చూపించెవాడు... దీని పై మీ కామెంట్...

Thursday, October 4, 2007

దేశభక్తి గీతాలు Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu

అందరమూ మానవులం Patriotic Songs Lyrics in Telugu Desha Bhakthi Geethalu

నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిటి తండ్రీ, నీ పిల్లల మేమెల్ల
||నారా||
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నా మనసుకు మబ్బయితే
మతం వద్దు గీతం వద్దు
మాయా మర్మం వద్దు
||నారా||
ద్వేషాలూ రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గతం వద్దు
మారణహోమం వద్దు
||నారా||
మతమన్న్దది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరమూ మానవులం
అందరమూ సోదరులం
- దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి

సామెతలు

A servant is known in his master's absence.
సేవకుడు, యజమాని లేనప్పుడు బయట పడతాడు.(ఎటువంటి వాడైంది తెలుస్తుంది)
Fools build houses where men live in them.
మూర్ఖులు (తెలివి తక్కువ) యిండ్లు కట్టుకుంటె తెలివైన వాళ్లు వాటిలో నివసిస్తారు.
Every wind is ill to a broken ship (mill)
పగిలిన ఓడకు ప్రతిగాలి చెడుగానే ఉంటుంది.
If you have a thing well done do it yourself.
పని మంచిగా ఉండాలి అని అనుకుంటే నీవె సొంతంగా చేసుకో.
He that dare not venture must not blame his Luck.
సాహసం చెయ్యలేని వాడు తన అదృష్టాన్ని నిందించుకోకూడదు.

Monday, October 1, 2007

మీరే చెప్పండి?

మొన్న గోకుల్ చాట్, లుంబిని పార్క్ నేడు పల్లెటూళ్ళలో కూడ మత పిచ్చి. మదొక పల్లెటూరు, ఈ రోజు అనగా మంగళవారం (01-10-2007) నవగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేశారు. షాప్స్, పాఠశాలలు అన్ని బంద్. ఈ మత కల్లోలలు, ఉగ్రవాదం అనేది ఎప్పుడు రూపు మారుతుందో తేలియదు కాని మన ఆదర్శవంతమైన భారతదేశం మత కల్లోలతోనే విసిగెత్తిపోతుంది అనడంలొ సందేహంలేదు. మనదేశంలో ఉంటు, మన తిండి తింటు, మన బట్ట కట్టి మన దేశానికే ద్రోహం చేయడం ఎంత వరకు సమాంజసం మీరే చెప్పండి?