Friday, October 5, 2007
మూన్ బాబా...
గురువారము సాయంత్రం 5:25 గంటలు...
అనంతపురం జిల్లా పుట్టపర్తి...
సత్య సాయిబాబా ఆశ్రమంలోని సాయి కుల్వంత్ హాలు...
భజన కార్యక్రమం జరుగుతుంది. సత్యసాయి అనువాదకుడు అనిల్ కుమార్ భక్తులతో మాట్లాడారు. రాత్రి 7 గంటలకు ఆకాశంలో విశ్వరూప విరాట్ దర్శనం ఉంటుందని ప్రకటించారు. చంద్రుడిలో భగవంతుడు కనిపిస్తాడని చెప్పారు. అలా కనిపించేది భగవంతుడా, సత్యసాయా అన్నది స్పష్టంగా పేర్కొనలేదు. అంతే! పట్టణంలోను, రాష్ట్ర్రంలోను సంచలనం చెలరేగింది. చంద్రుడిలో సత్యసాయి కనిపించనున్నారని వార్తలు వ్యాపించాయి. దీంతో పుట్టపర్తి నుంచి జనం తండోపతండాలుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం లోపల వెలుపల భక్తులతో నిండిపోయింది. మరో వైపు దీనిపై టీవిల్లో వార్తలు వచ్చాక... 6:40 గంటలకు క్రమంగా భక్తుల సంఖ్య పెరిగిపోయింది. దాదాపు 10 నుంచి 15 వేల మందికి పైగా అక్కడికి చేరుకున్నారంటే ఎంత భక్తో ఆలోచించాలి. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి ప్రకటనలకు జనాలు తండోపతండాలుగా వెళ్ళారంటే ఆశ్చర్యం వేస్తుంది. బాబాకు అంతశక్తి ఉంటే మబ్బులు పట్టిన, వర్షం కురిసిన ఆకాశంలో విశ్వరూప విరాట్ దర్శనం చూపించెవాడు... దీని పై మీ కామెంట్...
This comment has been removed by the author.
ReplyDeleteతాజా వార్త
ReplyDeleteఈ రోజు బ్లాగర్లందరికి బాబా విశ్వరూపం కనిపించబోతోంది...(ఎలా అని నన్నడగకండి..కొంచమైనా సస్పెన్స్ వుండద్దూ మరి )
వివరాలకు సంప్రదించండి
అనిల్ కుమార్, c/o ప్రశాంతి నిలయం, పుట్టపర్తి
తోలు కళ్ళతో చూసే వాళ్ళకు ఇలా అనిపించడంలో తప్పు లేదు.
ReplyDeletecheppeavaadiki vineavaadu lokuva. sabarimalielo makara samkranti rojuna yetaa yemi jarugutumdoo. prastutam aaripooyea dasaloo unna mahaa moosagaadu sattipandu yeadoo okati cheasi maliee bhaktulanu poogeasukuneamduku paavulu kadipaadu. cenemaa chadamaamanu dimpeamduku cheasukunna sannahaalu papam vaataavaranam anukoolimchaka baaba boltaa kottadu paapam. meekeamayinaa anumaam untea o gummadi kayanu immani adagandi????
ReplyDeleteబాబా కూడా వెళ్ళారట గా.మరి దేవుడిని చూడడానికో?తనని చూసుకోడానికో?
ReplyDelete