Barata mataku jejelu telugu song lyrics - Badi Panthulu
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ విప్లవ వీరులు వీర మాతలు … విప్లవ వీరులు వీర మాతలు … ముద్దుబిడ్డలై మురిసే భూమి ..
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
Idi nijanga parena thokkala undi
ReplyDeleteTelisundali.. telivundali.. telusukone manasundali..
Deleteఆ తొక్కే నీ ఒంటిమీద కాస్త మందంగా పేరుకున్నట్టుంది. పాతచీరలో అయినా సరే కన్నతల్లి పవిత్రత తగ్గదు. లుంగీలో అయినాసరే కన్నతండ్రి ఔన్నత్యం తలొగ్గదు. వెళ్ళు!! భూమ్మీద తల్లిభారతిని మించిన ఒడి అనేది ఉంటే తల దాచుకో.
DeleteHi, Greetings!
ReplyDeleteOne suggestion:
In 3rd charanam, need to change as "Samatha vaadamu" instead of Manatha vadamu....