Sunday, January 6, 2008

నీలాంటి స్నేహితుని పొందిన అకీల్ అహ్మద్ చాలా అదృష్టవంతుడు.


ఏ బంధమూ చేయని సాయం స్నేహ బంధం మాత్రమే చేస్తుందనడంలో సందేహం లేదు.
ఆపదలో సహాయం చేయడానికి బంధువులు వెనుకడుగు వేసినపుడు కూడా స్నేహితుడు ముందుకే అడుగు వేస్తాడనేందుకు ఈ సంఘటనే ఉదాహరణగా నిలుస్తుంది. ఉత్తరప్రదేశ్ బరేలికి చెందిన ఇద్రిన్ ఖాన్‌‍, అకీల్ అహ్మద్ ఇద్దరూ బాల్యస్నేహితులే కాదు ప్రాణస్నేహితులు కూడా. దేహాలు వెరైనా ప్రాణాలు ఒక్కటే అన్నట్టుగా బాల్యం నుంచి పెరిగారు. ఇటువంటి స్తితిలో అకీల్ అహ్మద్‌కు జబ్బు చేయడంతో వైద్య పరీక్షలు చేయించగా, రెండు కిడ్నీలు (మూత్రపిండాలు) దెబ్బ తిన్నందున వేరే వారి మూత్రపిండాన్ని అత్యవసరంగా అమర్చాలని వైద్యులు సూచించారు. అసలే చిత్తు కాగితాల వ్యాపారం చేసే అకీల్ మంచం పట్టడంతో పూట గడవడమే కనాకష్టమైంది. ఇక వేరే వారి మూత్రపిండాన్ని కొనుగోలు చేసి అమర్చుకోగల ఆర్థికస్తోమత వారికి లేదు. ఇక మిగిలింది బంధుగణమే... కావడంతో అకీల్ బార్య నగ్మా వారికి పరిస్థితి తీవ్రతను వివరించింది. అకీల్ తోడబుట్టిన వారు కూడా ఏవేవో కుంటిసాకులు చెప్పి ముఖం చాటేశారే తప్ప ఆమెకు అండగా నిలవ లేదు.

మరోవైపున అకీల్‌కు త్వరగా మూత్రపిండం అమర్చకపోతే ప్రమాదమని వైదులు హెచ్చరించడంతో నగ్మాకు ఏమి చేయలో పాలుపోవడం లేదు. ఈ సమయంలోనే మీకు నేనున్నాను, భయం లేదు. ‘అంటూ అకీల్ ప్రాణంలో ప్రాణమైన స్నేహితుడు ఇద్రీస్‌ఖాన్ ముందుకోచ్చాడు. తన మూత్రపిండాల్లో ఒకటి స్నేహితునికిచ్చి అతన్ని బ్రతికించుకుంటానని చెప్పాడు. కానీ, మూత్రపిండం ఇవ్వడానికి ఇద్రీస్ సిద్దమైనా దాన్ని అమర్చే శస్త్రచికిత్స చేయడానికి చేతిలో ఫైసా లేని దైనం అకీల్ బార్యది. ఈ లోగా ప్రాణస్నేతుల వైనాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న కొందరు దాతలు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు రావడంతో అకీల్‌కు మూత్రపిండం అమర్చడానికి వీలు కలిగింది. త్వరలోనే అకీల్ అహ్మద్‌కు ఇద్రీన్‌ఖాన్ మూత్రపిండాన్ని అమర్చగలమనిస్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ అగర్వాల్ తెలిపారు.

నీ లాంటి స్నేహితులు కోటికి ఒక్కరు ఉంటారు. నీలాంటి స్నేహితుని పొందిన అకీల్ అహ్మద్ చాలా అదృష్టవంతుడు.

ఇద్రీస్‌ఖాన్ You are real Friend..........

మీరేమాంటారు...

(ఈనాడు సౌజన్యంతో...)

1 comment: